logo

చిన్నారి విక్రయానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

బాలుణ్ని తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టగా.. పోలీసులు అడ్డుకున్న సంఘటన జడ్చర్లలో జరిగింది. ఎస్సై శంషుద్దీన్‌ తెలిపిన వివరాలు.. ముంబయిలో ఉంటున్న జడ్చర్ల

Published : 17 Jan 2022 01:48 IST

జడ్చర్ల అర్బన్‌, న్యూస్‌టుడే : బాలుణ్ని తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టగా.. పోలీసులు అడ్డుకున్న సంఘటన జడ్చర్లలో జరిగింది. ఎస్సై శంషుద్దీన్‌ తెలిపిన వివరాలు.. ముంబయిలో ఉంటున్న జడ్చర్ల దంపతులకు 18 ఏళ్లుగా సంతానం కలగకపోవడంతో కావేరమ్మపేటకు చెందిన ఆంజనేయులు, ఎల్లమ్మ, బాలమ్మకు ఫోన్‌ చేసి పెంచుకునేందుకు బాబు కావాలని, ఎవరైనా విక్రయిస్తే తీసుకురావాలని కోరారు. దీంతో ఈ ముగ్గురు కలిసి బాదేపల్లి పాతబజార్‌కు చెందిన సైదులు, సావిత్రి దంపతులను సంప్రదించారు. ఈ దంపతులకు ఇంతకుముందే ముగ్గురు పిల్లలుండగా.. మూణ్నెల్ల కిందట పుట్టిన మగ శిశువును రూ.30వేలకు అమ్మేందుకు ఒప్పందం జరుగుతుండగా సమీపంలోని ఓ వ్యక్తి 100కి ఫోన్‌ చేసి చెప్పారు. అక్కడికి వెళ్లి అందర్నీ అదుపులోకి తీసుకున్నామని, చట్టవ్యతిరేకంగా శిశువు విక్రయానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని