logo

దేశ భద్రత కోసం యువత సైన్యంలో చేరాలి

దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, దేశ భద్రత కోసం యువతి, యువకులు సైన్యంలో చేరాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవత్‌ఖూభా పిలుపునిచ్చారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో

Published : 17 Jan 2022 01:48 IST

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి భగవత్‌ఖూభా

మాట్లాడుతున్న కేంద్రమంత్రి భగవత్‌ఖూభా

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే : దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, దేశ భద్రత కోసం యువతి, యువకులు సైన్యంలో చేరాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవత్‌ఖూభా పిలుపునిచ్చారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో యువ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సైనిక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్నలు, దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే సైనికుల సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. దేశ భధ్రత, రక్షణకు మంచుకొండల్లోనూ రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న సైనికులు, వారిని కనిపంపిన తల్లిదండ్రులు అభినందనీయులన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తుందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ.. అసలు సిసలైన, నిఖార్సయిన హీరోలు  సైనికులన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డినారాయణరెడ్డి మాట్లాడుతూ  సైనికుల స్ఫూర్తితో యువత సైన్యంలో చేరాలన్నారు. వెల్దండలో సైనిక భవనానికి తన నిధుల్లో నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఏపీ టూరిజం ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఆనంతరం పలువురు సైనికులకు, విశ్రాంత సైనికులు, వారి తల్లితండ్రులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కారించారు. అంతకముందు వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు మదన్‌గౌడ్‌, నాయకులు విజేందర్‌రెడ్డి, రామకృష్ణ, డా.హరికాంత్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, రాజేందర్‌రెడ్డి, యాదగిరి, విశ్రాంత సైనికులు చంద్రశేఖర్‌గౌడ్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని