logo

సామరస్యానికి ప్రతీక .. రంగాపూర్‌ ఉర్సు వేడుక

ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రధాన ఉర్సు వేడుకల్లో రంగాపూర్‌ నిరంజన్‌షాలి జాతరకు ప్రత్యేకత ఉంది. హిందూ, ముస్లింలు కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. మహబూబ్‌నగర్‌-శ్రీశైలం ప్రధాన రహదారిపై అచ్చంపేటకు 8

Published : 17 Jan 2022 01:48 IST

నేడు గంధోత్సవం

రంగాపూర్‌ నిరంజన్‌షావలి దర్గా

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రధాన ఉర్సు వేడుకల్లో రంగాపూర్‌ నిరంజన్‌షాలి జాతరకు ప్రత్యేకత ఉంది. హిందూ, ముస్లింలు కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. మహబూబ్‌నగర్‌-శ్రీశైలం ప్రధాన రహదారిపై అచ్చంపేటకు 8 కి.మీ. దూరంలో దర్గాతండా (రంగాపూర్‌) గ్రామం ఉంది. ఇక్కడ వెలసిన నిరంజన్‌షావలి దర్గాలో ఉర్సు వేడుకలు సోమవారం ప్రారంభమవుతాయి. పది రోజుల పాటు కన్నుల పండువగా జరిగే ఈ జాతర ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఉమామహేశ్వరం బ్రహ్మోత్సవాలతో పాటు ఉర్సు వేడుకలు ఒకేసారి జరగటంతో మతసామరస్యం వెల్లివిరుస్తుంది. కందూరు చేసి దర్గాలో ఫాతేహా సమర్పించి మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల్లో 80 శాతం మంది హిందువులే ఉండటం విశేషం. ఎంపీ రాములు మంజూరు చేసిన రూ. 20 లక్షలతో భక్తుల కోసం విశ్రాంతి గదులను నిర్మిస్తున్నామని, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని దర్గా కమిటీ అధ్యక్షుడు అమీనుద్దీన్‌ పేర్కొన్నారు.
ః 17న రాత్రి వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గంధంతో 18న తెల్లవారు జామున దర్గాలో సమర్పించి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఉత్సవాలు ప్రారంభిస్తారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌ కళాకారుల ఖవ్వాలీ, దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ డిపోల నుంచి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.  ఆర్డీవో పాండు, డీఎస్పీ నర్సింహులు, సీఐ అనుదీప్‌  భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని