logo

ఘనంగా నిరంజన్‌షావలి గంధోత్సవం

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంగాపూర్‌ నిరంజన్‌షావలి ఉర్సు వేడుకల్లో భాగంగా అచ్చంపేటలో సోమవారం రాత్రి 10.30 గంటలకు గంధోత్సవ ఊరేగింపు ప్రారంభమైంది. అచ్చంపేట జామే మసీదు కమిటీ

Published : 18 Jan 2022 01:52 IST

పాల్గొన్న విప్‌ గువ్వల బాల్‌రాజు

పూలతో అలంకరించిన గంధోత్సవం

అచ్చంపేట, న్యూస్‌టుడే : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంగాపూర్‌ నిరంజన్‌షావలి ఉర్సు వేడుకల్లో భాగంగా అచ్చంపేటలో సోమవారం రాత్రి 10.30 గంటలకు గంధోత్సవ ఊరేగింపు ప్రారంభమైంది. అచ్చంపేట జామే మసీదు కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మనోహర్‌ ప్రసాద్‌, అశోక్‌ ప్రసాద్‌ ఇంటి నుంచి గంధోత్సవాన్ని తీసుకెళ్లారు. పటేల్‌ వంశస్థుల ఆధ్వర్యంలో  ఏళ్లుగా గంధోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు గంధాన్ని తలపై మోసుకొని వెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచారు. హిందూ, ముస్లింలు కలిసి ఏకతతో వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. డీజే మోతల మధ్య యువత నృత్యాలతో సందడి నెలకొంది. గంధోత్సవాన్ని అలంకరించిన వాహనాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో అర్ధరాత్రి వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గంధోత్సవాన్ని మండలంలోని రంగాపూర్‌ దర్గాకు తీసుకొని వెళ్లడంతో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, జామే మసీదు కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని