logo

122 కరోనా కేసులు నమోదు

జిల్లా వ్యాప్తంగా సోమవారం 122 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి డా. సుధాకర్‌లాల్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పురపాలక సంఘం పరిధిలో 34, కల్వకుర్తిలో 24, అచ్చంపేటలో 9, కొల్లాపూర్‌లో 8 కేసులు

Published : 18 Jan 2022 01:53 IST

కందనూలు, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా సోమవారం 122 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి డా. సుధాకర్‌లాల్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పురపాలక సంఘం పరిధిలో 34, కల్వకుర్తిలో 24, అచ్చంపేటలో 9, కొల్లాపూర్‌లో 8 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 15 కేసులు నమోదు కాగ, లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 6, తిమ్మాజిపేటలో 3, తెలకపల్లిలో 5, తాడూరులో 4 కేసులు నమోదైన్నట్లు జిల్లా వైద్యాధికారి వివరించారు. పండుగ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం వలన కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని డీహెచ్‌ఎంవో సూచించారు. కేసుల వ్యాప్తిని తగ్గించడానికి ప్రజలు తప్పని సరిగ్గా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని