logo

చిత్రవార్తలు

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గద్వాల

Updated : 25 Jan 2022 02:25 IST

సెలవుల వేళ చిన్నారులు జాగ్రత్త !

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలోకి వెళ్లి గుంతల్లో నిలిచిన నీటిలో ఈత నేర్చుకుంటూ కనిపించారు. నదిలో పెద్ద పెద్ద రాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏమాత్రం అదుపు తప్పినా, నీటిలో మునిగినా వారి ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదముంది.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


అందరూ ఉన్నా అనాథలా అమ్మ..!

రోడ్డు పక్కన నిద్రపోతున్న ముడావత్‌ టుగ్రీ

ముగ్గురు కొడుకులు.. అయిదుగురు కూతుళ్లను నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్లను చేసింది. వారంతా పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడేలా చేసిన ఆ అమ్మ.. వయోభారంతో నడవలేని దీనస్థితిలో మతిస్థిమితం సరిగా లేక రోడ్డెక్కింది. ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఎలా వెళ్లాలో తెలియని స్థితిలో రోడ్డు పక్కన కూలబడింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంది. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని ఓ తండాకు చెందిన 90 ఏళ్ల ముడావత్‌ టుగ్రీ ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చింది.. అలసిసొలసి రోడ్డు పక్కన చెట్టు నీడలో నిద్రలోకి జారుకుంది. సాయంత్రం వరకు రోడ్డుపై అలాగే ఉండిపోయింది. తండావాసులు చూసి ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పెద్దకొడుకు, మూడో కొడుకు వచ్చి అమ్మను ఇంటికి వెళ్లారు.

- న్యూస్‌టుడే, వనపర్తి గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని