logo

ఆన్‌లైన్‌కు హాజరు అంతంతే

కరోనా మూడో దశ విజృంభణ ప్రభావం జిల్లాలో చదువులపై పడుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన విషయం విధితమే. అయితే తొలిరోజు జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతులకు

Published : 25 Jan 2022 02:44 IST

 తొలి రోజు 51 శాతమే
 కరోనా మూడో దశతో చదువులపై ప్రభావం
న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం

కరోనా మూడో దశ విజృంభణ ప్రభావం జిల్లాలో చదువులపై పడుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన విషయం విధితమే. అయితే తొలిరోజు జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతులకు కేవలం  51 శాతం మాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 104 ప్రాథమికోన్నత, ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, మైనార్టీ గురుకులం, జ్యోతిబా ఫులే, ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 8 నుంచి 10వ తరగతి వరకు 22,205 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 11,266 మంది తొలిరోజు హాజరుకాగా.. 10,939 మంది తరగతులు  వినలేదు.
గాడిలో పడేనా ?
  కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగినా విద్యార్థులు వంద శాతం హాజరు కాలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఆలస్యంగా 2020 సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా ఈ నెల 30 వరకు విద్యా సంస్థలు తెరవరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఉన్నత తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించిన 51 శాతమే హాజరయ్యారు. పెద్ద పిల్లలు తరగతులకు హాజరు కాకపోతే ఈ తరగతులు గాడిలో పడతాయో లేదోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురి దగ్గర చరవాణులు, టీవీలు లేక పోవడంతో తరగతులు వినలేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అందరూ సద్వినియోగం చేసుకోవాలి..
ఆన్‌లైన్‌ తరగతులకు అందరూ హాజరు కావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని తరగతులకు విధిగా హాజరు కావాలని ఉపాధ్యాయులు కూడా చెబుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పిల్లలు తరగతులకు హాజరవుతున్నారో లేదో ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ధన్వాడ, దామరగిద్ద, మద్దూర్‌ మండలాల్లోని పలు పాఠశాలలను నేను పరిశీలించా.

- శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లాలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 104

8 నుంచి 10 తరగతుల విద్యార్థులు 22,205

ఆన్‌లైన్‌ తరగతులకు  హాజరైనవారు 11,266

గైర్హాజరు 10,939

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని