logo

గురుకులం.. భవిత ఉజ్వలం

మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలు

Published : 25 Jan 2022 02:44 IST

మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తులకు ఫిబ్రవరి 3 గడువు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్‌

మహబూబ్‌నగర్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం తరగతి గదిలో విద్యార్థినులు

మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. దీని ద్వారా విద్యార్థినులు ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో సీట్లు, సదుపాయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.
విద్యార్థినులకు వరం : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం పిల్లలమర్రి సమీపంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, తిరుమల హిల్స్‌లో గిరిజన మహిళా డిగ్రీ గురుకులం, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో గురుకులం డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నా అధునాతన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులతో పాటు ఆట స్థలం, గ్రంథాయల సదుపాయాలు కల్పించారు. బోధన సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. కళాశాలకు ప్రహరీ ఉంది. ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
సదుపాయాలివీ : బీకాం(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), ఎంపీసీˆ, బీఎసీˆ్స(డీఎస్‌) బీజెడ్‌సీˆ, ఎంజెడ్‌సీ, బీకాం(బీఏ), బీఏ(హెచ్‌ఈపీˆ), ఎంఎస్‌సీˆఎస్‌ తదితర కోర్సులు ఉండగా విద్యార్థినులకు కాస్మొటిక్‌ ఛార్జీల కింద ప్రతి నెలా రూ. 140 అందజేస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులు, ట్రాక్‌షూట్, క్యాజువల్‌ దస్తులు, తువ్వాలు, బూట్లు, ప్లేట్, గ్లాసు, ట్రావెలింగ్‌ బ్యాగు, దుప్పట్లు, పరుపు ఉచితంగా అందజేస్తారు. పరీక్ష రుసులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఐఐటీ, పీˆజీ ప్రవేశ పరీక్షలకు అవసరమైన ప్రత్యేకమైన శిక్షణను ఇస్తున్నారు. డిగ్రీ తర్వాత అవకాశం ఉన్న పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. పీˆజీ, క్యాట్, మ్యాట్, జామ్‌, ప్రవేశ పరీక్షలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు శిక్షణ ఇస్తారు.
చక్కటి అవకాశం : నిరుపేద విద్యార్థినులకు గురుకుల విద్యాలయాలు వరంగా చెప్పవచ్చు. ఏటా ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. చదువుకోవాలనే ఆసక్తి, శ్రద్ధ, ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్ష ఉంటే చాలు. అన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది.

- డా.జయప్రద, ప్రిన్సిపల్‌, పిల్లలమర్రి గురుకులం, మహబూబ్‌నగర్‌.

నమోదు ఇలా.. : గురుకుల డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఇంటర్‌లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 90 శాతం సీˆట్లు ఎసీˆ్సలకు కేటాయిస్తారు. ప్రతి కోర్సులో 40  సీˆట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. అర్హత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని