logo

బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం

బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలల నుంచి అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు

Published : 25 Jan 2022 02:44 IST

మూడు నెలల్లో 428 మందిపై కేసుల నమోదు
న్యూస్‌టుడే, పాలమూరు

మహబూబ్‌నగర్‌ : కొత్త చెరువు రోడ్డు వద్ద రాత్రి పూట తాగుతున్న మందుబాఋ

బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలల నుంచి అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. పగలు, రాత్రి అన్ని తేడా లేకుండా మందుబాబుల అడ్డాలను తనిఖీ చేస్తూ పట్టుకుంటున్నారు. వెంటనే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చుతున్నారు. వారికి రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు జరిమానాలను విధిస్తున్నారు. గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 428 కేసులను నమోదు చేశారు. పోలీసుల తనిఖీలతో మందుబాబులు బహిరంగ ప్రాంతాల్లో తాగాలంటేనే భయపడుతున్నారు.
మందుబాబుల అడ్డాలకు చెక్‌
మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ పురపాలిక పరిధిలో మందుబాబుల అడ్డాలు చాలా ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామ ప్రాంతాల్లో ప్రత్యేక అడ్డాలు ఉన్నాయి. అనుమతి లేకుండా జాతీయ రహదారుల వద్ద ఉన్న ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాలతో పాటు ఖాళీస్థలాలు, రియల్‌ వెంచర్ల వద్ద మందుబాబులు సాయంత్రం కాగానే చేరి మద్యం తాగుతూ ఉంటారు. పలువురు పగలు, రాత్రి తేడా లేకుండా నివాసాల మధ్యనే తాగుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి పోలీసులు పబ్లిక్‌ న్యూసెన్స్‌తో పాటు డిజాస్టర్‌ మెనేజ్మెంట్‌ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.
డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌  తనిఖీలు..
రహదారులపై మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిపై కూడా పోలీసులు నజర్‌ పెట్టారు. కూడళ్ల వద్ద పోలీసులు గస్తీ కాసి మందుబాబులను పట్టుకున్నారు. బ్రీతింగ్‌ అనలైజర్‌ యంత్రంతో పరీక్షలు చేసి మద్యం తాగిన వారిని గుర్తిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లతో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటంతో మద్యం తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వారిపై కేసులు పెట్టి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. తాగిన శాతం బట్టి జరిమానాలు లేదా జైలు శిక్షను విధిస్తున్నారు.


నిరంతరంగా కొనసాగిస్తాం : జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో బహిరంగ మద్యపానం వారిపై కేసులను నమోదు చేస్తున్నాం. మందుబాబులు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది అడ్డాలు తెలుసుకొని నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఈ తనిఖీలను ముమ్మరం చేశాం.

జిల్లాలో నవంబర్‌ నుంచి నమోదైన కేసులు

- కిషన్‌, మహబూబ్‌నగర్‌  డీఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని