logo

మహిళల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీలు కీలకం

మహిళల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. సోమవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆహార వైవిధ్య.. ప్రాముఖ్యత అంశంపై నిర్వహించిన మండల సదస్సులో

Published : 25 Jan 2022 02:44 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గట్టు, న్యూస్‌టుడే : మహిళల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. సోమవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆహార వైవిధ్య.. ప్రాముఖ్యత అంశంపై నిర్వహించిన మండల సదస్సులో పాల్గొని మాట్లాడారు. మహిళా, శిశు సంక్షేమానికి అమలవుతున్న పథకాలను వివరిస్తూ, స్త్రీలలో రక్తహీనత తదితర రుగ్మతలను పారదోలాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు అంకితభావంతో విధులు నిర్వహిస్తే మహిళల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని చెప్పారు. మండలంలో ఉత్తమ సేవలందించిన ముగ్గురు టీచర్లకు ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎంపీపీ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ శ్యామల, వైస్‌ఎంపీపీ సుమతి, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి ముషాహిదా బేగం సీడీపీవో కమలాదేవి, స్థానిక సర్పంచి ధనలక్ష్మి, ఎంపీటీసీలు కృష్ణ, మహేశ్వరి, సూపర్‌వైజర్‌ నాగరాణి, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని