logo

మాతా శిశువులకు ఆరోగ్య రక్ష

జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వనపర్తి జిల్లా కేంద్రంలో  100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ ప్రసవాలు ఎక్కువ జరగడం, సంరక్షణ కొరవడంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని

Published : 25 Jan 2022 03:15 IST

నేడు మంత్రులతో సంరక్షణ కేంద్రం ప్రారంభం

ప్రారంభానికి సిద్ధమైన మాతా శిశుసంరక్షణ కేంద్ర భవనం

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వనపర్తి జిల్లా కేంద్రంలో  100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ ప్రసవాలు ఎక్కువ జరగడం, సంరక్షణ కొరవడంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల క్రితం గోపాల్‌పేట రోడ్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రూ.17 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కొవిడ్‌ విజృంభణ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడుతూవస్తోంది. ఎట్టకేలకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడే టీ హబ్‌ భవన నిర్మాణం, శిశు సంరక్షణ కేంద్రం గోపాల్‌పేట రోడ్డు వరకు సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో రూ.80 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, బైపాస్‌ యంత్రం, 12 పోటోథెరఫి యంత్రాలు ఏర్పాటుచేశారు. ఆసుపత్రిలో మరో రెండు వెంటిలేటర్లను సిద్ధం చేశారు. వీటిని ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనకు  మంత్రులు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని