logo

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

అమరచింత తహసీల్దారు కార్యాలయం వద్ద జాతీయ ఓటరు దినోత్సవాన్ని...

Updated : 25 Jan 2022 15:11 IST

అమరచింత: అమరచింత తహసీల్దారు కార్యాలయం వద్ద జాతీయ ఓటరు దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు సింధూజ ఓటు ప్రాముఖ్యతను తెలియజేసేవిధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంకు పునాది ఓటు అని.. దాన్ని ఓటర్లు ఆయుధంగా వినియోగించుకుని మంచి పాలకుడిని ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గోపాల్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య, అంగన్‌వాడీ టీచర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని