logo

పాముకాటుకు రైతు బలి

పొలంలోని మామిడితోటలో పనిచేస్తుండగా పాము కాటుకు గురైన రైతు మృతిచెందిన ఘటన మంగళవారం పాన్‌గల్‌ మండలం కదిరెపాడు....

Published : 26 Jan 2022 04:40 IST


నారాయణ (పాతచిత్రం)

కదిరెపాడు (పాన్‌గల్‌), న్యూస్‌టుడే : పొలంలోని మామిడితోటలో పనిచేస్తుండగా పాము కాటుకు గురైన రైతు మృతిచెందిన ఘటన మంగళవారం పాన్‌గల్‌ మండలం కదిరెపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నారాయణ (58) తన సొంత మామిడితోటలో చెట్లకు నీరు కట్టెందుకు గుంతలు తవ్వుతుండగా పాము కాటేసింది. తనను పాము కాటేసిందని, కాపాడండి అంటూ సమీప పొలాల్లో ఉన్నవారి దగ్గరకు పరుగుపెడుతూ పొలాల్లోనే కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సర్పంచి లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యురాలు నాగమ్మ, గ్రామస్థులు రామకృష్ణ, సత్యం తదితరులు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని