logo

మంత్రి కేటీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

Published : 09 May 2022 03:10 IST


మినీ క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సోమవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముందుగా 11 గంటలకు పేట మండలం సింగారం చౌరస్త్తాలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా సంప్‌ హౌజ్‌, విద్యుత్తు ఉపకేంద్రం ప్రారంభిస్తారు. 11 : 30 గంటలకు 6వ వార్డులో పార్కు, గోల్డ్‌సోక్‌ మార్కెట్‌, మినీ క్రీడా మైదానం నిర్మాణాలకు శంకుస్థాన చేయనున్నారు. 11.50 గంటలకు గురుకుల పాఠశాల దగ్గర జిల్లా గ్రంథాలయం, దోభి ఘాట్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు 20వ వార్డులో పురపాలక దుకాణ సముదాయానికి శంకుస్థాపన, అనంతరం మాసం, చేపల మార్కెట్‌ను ప్రారంభిస్తారు. 12.45 గంటలకు సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర మినీ ట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు శంకుస్థాన, 1.30 గంటలకు బారంబావి సమీపంలో చిల్డ్రన్స్‌ హోంకు శంకుస్థాపన చేస్తారు. వయోవృద్ధుల ఆశ్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం.. అనంతరం 3.30 నుంచి 5 గంటల వరకు మినీ క్రీడా మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని