logo

బిడ్డలను కాపాడబోయి అనంతలోకాలకు..

తన బిడ్డలను కాపాడబోయిన ఓ తల్లి మృత్యువాత పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. అయిజ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన రామకృష్ణ సెప్టిక్‌ ట్యాంకర్‌ను

Published : 24 May 2022 04:33 IST

సెప్టిక్‌ ట్యాంకర్‌ కింద పడి తల్లి మృతి

అయిజ, న్యూస్‌టుడే : తన బిడ్డలను కాపాడబోయిన ఓ తల్లి మృత్యువాత పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. అయిజ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన రామకృష్ణ సెప్టిక్‌ ట్యాంకర్‌ను నిర్వహిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన వెంకట్రావ్‌ తన ఇంటి వద్ద సెప్టిక్‌ ట్యాంక్‌ నిండిందని శనివారం మధ్యాహ్నం రామకృష్ణ ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో రామకృష్ణ ఇంట్లో లేకపోవడంతో ప్రస్తుతం ఎవరూ లేరని, డ్రైవర్‌ను తీసుకొస్తే ట్యాంకర్‌ను పంపిస్తామని భార్య నాగలక్ష్మి(26) చెప్పారు. కొద్దిసేపటికి వెంకట్రావ్‌ తీసుకొచ్చిన డ్రైవర్‌ సెప్టిక్‌ ట్యాంకర్‌ వాహనాన్ని స్టార్ట్‌ చేయగా అప్పటికే రివర్స్‌ గేరులో ఉండటంతో అతి వేగంగా వాహనం వెనక్కి దూసుకెళ్లింది. వెనక ఆడుకుంటున్న తన ఇద్దరు కూతుళ్ల మీదకు వాహనం వెళ్తుందని గమనించిన నాగలక్ష్మి వారిని పక్కకు తోసేసింది. తాను తప్పుకోవడానికి ప్రయత్నించేలోగా వాహనం ఆమెపై దూసుకెళ్లింది. గాయాలవడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని ఎస్సై నరేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని