logo

అప్రమత్తతతోనే పిడుగుపాటుకు దూరం

జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. మల్దకల్‌ మండలంలోని పావనంపల్లెలో ఓ రైతు, గద్వాల మండలంలోని బస్రచెర్వుకు చెందిన 9వ తరగతి విద్యార్థి పిడుగుపాటుతో ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ చెట్టు

Updated : 05 Aug 2022 06:29 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. మల్దకల్‌ మండలంలోని పావనంపల్లెలో ఓ రైతు, గద్వాల మండలంలోని బస్రచెర్వుకు చెందిన 9వ తరగతి విద్యార్థి పిడుగుపాటుతో ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ చెట్టు కింద ఉన్న సమయంలోనే పిడుగుపాటుకు గురయ్యారు. పావనంపల్లెలో జరిగిన ఘటనలో రైతుతోపాటు రెండు ఎద్దులు చనిపోయాయి. నెల రోజులుగా పాలమూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పిడుగుపాటుకు ఆస్కారం ఉంటుంది. ఏటా పిడుగుపాటుతో పాలమూరు జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండి వర్షం పడుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటుకు గురికాకుండా దూరంగా ఉండొచ్ఛు ప్రధానంగా పొలాలకు వెళ్లే రైతులు, వారి కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందికి వెళ్లొద్ధు

* ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఎత్తు ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్‌ఫొన్‌ టవర్లు, విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలి.

* వ్యవసాయ పొలంలో ఉండే పంపులకు సంబంధించిన విద్యుత్తును నిలిపివేయాలి. లోహపు వస్తువులు, వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలి.

* మూగజీవాలను చెట్ల కిందికి తోలవద్ధు

* చరవాణిలో మాట్లారాదు. ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్గర పెట్టుకోరాదు.

* టీవీ, రేడియోల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకొని ఆ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

చేతులతో చెవులను మూసుకోవాలి..

వర్షం, ఉరుములు, మెరుపులున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందికు వెళ్లరాదు. పిడుగు హైవోల్టేజీతో ఉంటుంది. చెట్లకు త్వరగా ఆకర్శితమవుతుంది. ఖాళీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కాళ్లమీద శరీరం భూమికి తగలకుండా రెండు చేతులతో చెవులను మూసుకొని కూర్చోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి వాటి వద్ద కూర్చోరాదు. పిల్లల వెంబడి జాతరకు వెళ్లినప్పుడు వర్షం, ఉరుములు, మెరుపులు వస్తే అందరూ ఒకే చోట కాకుండా దూరదూరంగా ఉంటే మంచిది. - సుధాకర్‌, అగ్నిమాపకశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

ఇవిగో సంకేతాలు..

* ఆకాశంలో నల్లని మబ్బులు ఏర్పడడం

* మెరుపులు కనిపించడం

* ఉరుములు వినిపించడం

* వేగంగా గాలులు వీయడం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని