logo

ప్రాణాలకు తెగించి పల్లెకు

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రమైన అడ్డాకులకు రావాలంటే

Published : 10 Aug 2022 05:39 IST

వాగులో ప్రమాదకరంగా దాటుతున్న వర్నె గ్రామస్థులు

న్యూస్‌టుడే, అడ్డాకుల: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రమైన అడ్డాకులకు రావాలంటే కొత్తకోట మీదుగా 20 కిలోమీటర్లకు పైగా అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. మంగళవారం మొహర్రం కోసం హైదరాబాదులో వలస కూలీలుగా ఉపాధి పొందుతున్న మహేష్‌, శేఖర్‌లు కుటుంబ సభ్యులతో గ్రామానికి వచ్చారు. పెద్దవాగుపై తాత్కలిక వంతెన తెగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు చిన్నపిల్లలతో ఇలా ప్రమాదకరంగా వాగును దాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు