logo

దళితబంధు పేరుతో మోసం : సంపత్‌కుమార్‌

దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆరోపించారు. ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర గురువారం ఇటిక్యాల మండలంలోని వీరాపురం, దువాస్‌పల్లి, బీవీపల్లి ధర్మవరం,

Updated : 12 Aug 2022 05:40 IST

మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

ఇటిక్యాల, న్యూస్‌టుడే : దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆరోపించారు. ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర గురువారం ఇటిక్యాల మండలంలోని వీరాపురం, దువాస్‌పల్లి, బీవీపల్లి ధర్మవరం, వేముల, చాగాపురం గ్రామాల్లో కొనసాగింది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఇందిరమ్మ గృహాలు, ఉచిత కరెంటు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. యువకులకు నిరోద్యోగ భృతి ఊసే లేదన్నారు. రైతులకు రైతుబంధు పేరుతో రాయితీపై ఇచ్చే విత్తనాలు, యంత్ర పనిముట్లను ఎత్తేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ అట్టకెక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలో రూ.రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని, విత్తనాలు, యంత్ర పనిముట్లు రాయితీపై అందజేస్తామన్నారు. వేముల మాజీ సర్పంచి లక్ష్మన్నను కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మరోసారి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జెండాతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, లౌకికవాదానికి జాతీయ జెండా చిహ్నంమని అవి కేంద్రం, రాష్ట్రంలోనూ కొరవడ్డాయని ఆరోపించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి, డీసీసీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ తాలుకా అధ్యక్షుడు రవి, మాజీ అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహులు, వీరాపురం సర్పంచి రాముడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని