logo

సమన్వయంతో వజ్రోత్సవాలను జయప్రదం చేయాలి

ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో జయప్రదం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Published : 12 Aug 2022 03:16 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో జయప్రదం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహిస్తున్నామని అందుకనుగుణంగా వేదిక, బ్యారికేడింగ్‌ ఏర్పాటుతోపాటు లోపల, వెలుపలికి వెళ్లే దారిని లెవలింగ్‌ చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే అతిథులకు పోలీసు వందనంతోపాటు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చూడాలని అడిషనల్‌ ఎస్పీకి సూచించారు. ఉత్సవాలు జరిగే ప్రదేశాన్ని శుభ్రంగా ఉండే విధంగా చూడాలని కమిషనర్‌కు పనులు అప్పగించారు. ఉత్సవాలకు విద్యుత్తు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం అతిథులను ఆహ్వానించాలని, అందుకు ఆహ్వాన పత్రికలను ముద్రించాలన్నారు. అధికారులు తమకు అప్పగించిన పనులకు పూర్తి చేసేలా, వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా ఆర్డీవో రాములకు సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అయిదుకు మించకుండా సిద్ధం చేయాలని, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇవ్వడానికి అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని ఏవోకు సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ రాములునాయక్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చందూనాయక్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని