logo

వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

స్వాతంత్య్ర దినోత్సవమంటే ఒక్క రోజు చేసుకునే పండుగ కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన స్వాతంత్య్ర పరుగును

Updated : 12 Aug 2022 04:07 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


జాతీయ జెండాతో మంత్రి నిరంజన్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తదితరులు

వనపర్తి, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర దినోత్సవమంటే ఒక్క రోజు చేసుకునే పండుగ కాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన స్వాతంత్య్ర పరుగును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్య్రం విలువ, సమరయోధులు చేసిన త్యాగాలు ఈ తరానికి, భవిష్యత్తు తరానికి తెలియజేయడానికి సీఎం కేసీఆర్‌ 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారని అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటీష్‌ పాలకుల అడుగులకు మడుగులొత్తిన వారు నేడు ఈ దేశానికి ప్రభువులుగా ఉన్నారని విమర్శించారు. అనంతరం పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి ఆర్టీసీˆ బస్టాండు, పాత కలెక్టరు కార్యాలయం, రామాలయం, మర్రికుంట మీదుగా ఎకో పార్కు వరకు స్వాతంత్య్ర పరుగు నిర్వహించారు. మంత్రి జాతీయ జెండా పట్టుకుని పరుగెత్తారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు షేక్‌ యాస్మిన్‌బాషా, జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, ఆశిష్‌సంగ్వాన్‌, పుర అధ్యక్ష, ఉపాధ్యక్షులు గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌ తదితర అధికారులు ఉన్నారు.

స్వాతంత్య్ర పరుగులో పాల్గొన్న యువత, ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని