Mahabubnagar: తహసీల్దార్ కార్యాలయంలో జాకీష్రాఫ్ సందడి
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ బుధవారం మహబూబ్‌నగర్ మండలం మూసాపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి రావటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
రిజిస్ట్రేషన్ దస్త్రాలు అందుకుంటున్న బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్
అడ్డాకుల, న్యూస్‌టుడే : బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి రావటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మండలంలోని నందిపేట శివారులోని 20 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ఆయన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చినట్లు తహసీల్దార్ మంజుల తెలిపారు. జాకీష్రాఫ్‌తో స్వీయచిత్రాలు తీసుకోవడానికి అధికారులతో పాటు స్థానికులు పోటీపడ్డారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత కార్యాలయ సిబ్బంది జాకీష్రాఫ్‌కు ధ్రువపత్రాలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.