సర్కారు విత్తనాలకు నిరీక్షణ
వేరుశనగ పంట సాగులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండించిన పల్లీలో నాణ్యత అధికంగా ఉంటుంది.
న్యూస్‌టుడే, వనపర్తి
పంపిణీకి సిద్ధంగా ఉన్న విత్తన సంచులు
వేరుశనగ పంట సాగులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండించిన పల్లీలో నాణ్యత అధికంగా ఉంటుంది. అందుకే డిమాండు ఎక్కువ. రైతులు కూడా వేరుశనగ సాగుకే మొగ్గుచూపుతారు. ప్రస్తుత యాసంగి సాగుకు అవసరమయ్యే విత్తనాల కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు అధికారులు ఇంతవరకు ఇండెంట్ పెట్టకపోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో నాగర్‌కర్నూలు జిల్లా తరవాత ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగ సాగుచేసేది వనపర్తి జిల్లాలోనే. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే నాగర్‌కర్నూలు జిల్లా నుంచి కూడా తమకు విత్తనాలు కావాలని ఇంకా ఇండెంట్ రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయం వనపర్తిలోనే ఉంది. ఇక్కడి నుంచే పలు జిల్లాలకు ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలను సరఫరా చేస్తారు.
రాయితీలేని కారణంగానే... : కరోనా తరవాత రెండేళ్లుగా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందించే వరి, వేరుశనగ తదితర విత్తనాలకు రాయితీ లభించడం లేదు. దీంతో రైతులు సాధారణ ధరకు ఎక్కడ కొనుగోలు చేసినా ఒక్కటేననే భావంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గతంలో సరఫరా చేసిన విత్తనాలు విక్రయం కాకపోవడంతో పలు జిల్లాల నుంచి వేరుశనగ విత్తనాల కోసం ఇంకా ఇండెంట్ పంపలేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో గతంలో సరఫరా చేసిన సరకులో కొంత మిగిలిందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల రైతులే వేరుశనగ విత్తనాల కోసం ఇండెంట్ పంపారు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల అధికారులు విత్తనాలు కావాలని తమ డిమాండ్ ఎంత ఉందో పంపలేదు. యాసంగిలోనూ అత్యధికంగా వేరుశనగ సాగుచేసే జిల్లాల్లో నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఇప్పటికే విత్తనాభివృద్ధి సంస్థ ఈ రెండు జిల్లాలకు విత్తనాలు పంపింది. ఈసారి కే6, లేపాక్షి 1812 రకాల వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తున్నారు.
సన్నాలలో బాపట్ల మసూరి నో.. : యాసంగి కాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరులో వనపర్తిలోనే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతోంది. సాధారణంగా సన్నాలలో సూపర్‌ఫైన్ రకమైన బాపట్ల మసూరిని కూడా ఎక్కువగా పండిస్తారు. కాని విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సన్నాలలో బాపట్ల కాకుండా ఆర్ఎన్ఆర్, కూనారం, జగిత్యాల, ఎంటీయూ రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నారు.
ఇండెంట్ ఇచ్చినవారికి సరఫరా.. : ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి యాసంగిలో పండించే వివిధ పంటలకు అవసరమైన విత్తనాలు కోరుతూ ఇండెంట్ ప్రకారం సరఫరా చేస్తున్నాం. వేరుశనగ విత్తనాలు కావాలని ఇప్పటివరకు రెండు జిల్లాల నుంచే వినతులు రావడంతో ఇప్పటివరకు వాటికే సరఫరా చేశాం.
- భిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజరు, వనపర్తి
అయిదు జిల్లాల్లో సాగయ్యే పంటల విస్తీర్ణం
జిల్లా వరి విత్తనాలు వేరుశనగ విత్తనాలు
(ఎకరాల్లో) (క్వింటాల్లో)
వనపర్తి 81366 1592 44,305 0
నారాయణపేట 57566 627 13,610 450.85
గద్వాల 34552 662 20,207 0
నాగర్‌కర్నూలు 75983 1163 130106 0
మహబూబ్‌నగర్ 57207 920 13,382 8.50
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడని 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్