కృష్ణా తీరం.. ఆక్రమణల పర్వం
జిల్లాలోని కృష్ణాతీరంలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ముంపుభూముల్లో పంటల సాగు, పర్యాటక ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నారు
న్యూస్టుడే, కొల్లాపూర్
నదీతీరంలో అక్రమంగా పంటల సాగు, నిర్మాణాలు
జిల్లాలోని కృష్ణాతీరంలో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ముంపుభూముల్లో పంటల సాగు, పర్యాటక ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నారు. దీనివలన విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. పర్యాటక ప్రదేశాల్లో కనీసం వచ్చిన వాహనాలు నిలుపుకోవడానికి స్థలాలు లేకుండా పోతున్నాయి. డబ్బాలు, తాత్కాలికంగా రేకులషెడ్లను నిర్మించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నదీతీరంలో అక్రమంగా పంటల సాగు, నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
పర్యాటక ప్రాంతంలో నిర్మాణాలు : నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ తీరప్రాంతం పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా సోమశిలలో కృష్ణానదిపై వంతెన, జాతీయ రహదారి నిర్మాణాలతో స్థలాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. నదీతీరంలోని ముంపు భూముల్లో కూడా పంటలసాగుతో పాటు తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటూ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. పుష్కరఘాట్ల దగ్గర, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో కూడా అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలు చేస్తూ పర్యాటకులు, భక్తులకు గదులను అద్దెకు ఇస్తున్నారు. విచ్చలవిడిగా దాబాలు వెలిసి మద్యం విక్రయాలు చేస్తున్నారు. నదీ తీరంలోనే మద్యం తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అమరగిరి, మంచాలకట్ట, జటప్రోల్ తీరగ్రామాల్లో కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి.
ః అచ్చంపేట ప్రాంతంలోని మన్ననూర్, ఈగలపెంట, వటవర్లపల్లి, అమ్రాబాద్, తదితర పర్యాటకప్రాంతాలలో స్థలాల కబ్జా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా డబ్బాలు, షెడ్లను వేసుకుంటున్నారు. వాహనాలపై తరలివస్తున్న పర్యాటకుల వాహనాలు నిలుపడానికి స్థలాలు లేకుండా పోతున్నాయి. కనీసం గ్రామపంచాయతీ అధికారుల అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటున్నారు. దీనివలన విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరలో చిక్కుకుంటున్నాయి. కాలక్రమంలో పర్యాటకులకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా వసతులు లేకుండా ఉండే పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలు, భూములు కబ్జాకు గురి కాకుండా శాఖపరంగా చర్యలు చేపట్టాలంటూ తీరగ్రామాల ప్రజలు కోరుతున్నారు.
చర్యలు చేపడుతాం.. : ప్రభుత్వ భూములు, స్థలాలు కబ్జాకు గురి కాకుండా శాఖపరమైన చర్యలు చేపడుతామని కొల్లాపూర్ ఆర్డీవో హనుమానాయక్ చెప్పారు. ఇప్పటికే తీరప్రాంతాల్లో ప్రభుత్వభూముల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాలయాలు, ఘాట్ల దగ్గర అనుమతులు లేకుండా డబ్బాలు, షెడ్ల నిర్మాణం చేయరాదన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే విచారించి శాఖపరమైన చర్యలు చేపడుతామని ఆర్డీవో వివరణ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్
-
Politics News
Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!