logo

సంపద సృష్టించేందుకే దళితబంధు

ఎలాంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన దళితులు ఆత్మవిశ్వాసంతో సంపద సృష్టించేలా తోడ్పాటు అందించేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు

Published : 27 Nov 2022 04:26 IST

మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, వేదికపై విప్‌ గువ్వల, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

చారకొండ, న్యూస్‌టుడే : ఎలాంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన దళితులు ఆత్మవిశ్వాసంతో సంపద సృష్టించేలా తోడ్పాటు అందించేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో 269 మంది దళితబంధు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌తో కలిసి వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకంతో దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తోందన్నారు. సీఎం దళితులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గానికి తాను స్థానికేతరుడినేనని, పుట్టింది వనపర్తిలోనైనా బతికేది, చచ్చేది ఈ గడ్డపైనేనన్నారు. 6 నెలల్లో మండలంలోని ప్రతి తండాకు రహదారిని నిర్మిస్తామన్నారు. రూ.12 కోట్ల నిధులతో శిర్సనగండ్ల అభివృద్ధి చేస్తామన్నారు. చారకొండ పట్టణంలోని రహదారిని నాలుగు రహదారులుగా విస్తరిస్తామన్నారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ దళితులు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. అంతకు ముందు నూతనంగా నిర్మించిన కేజీబీవీ భవనాన్ని, రైతువేదికను ప్రారంభించారు. డీసీసీబీ ఛైర్మన్‌ నిజాంపాషా, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బాలాజీసింగ్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌నాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాంలాల్‌నాయక్‌, ఎంపీపీ నిర్మల, సింగిల్‌విండో ఛైర్మన్‌ గురువయ్యగౌడ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు గజ్జె యాదయ్య. ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు