logo

అటవీ శాఖ సిబ్బందికి రక్షణ కల్పిస్తాం

నల్లమల అటవీప్రాంతంలో పని చేస్తున్న అటవీశాఖ సిబ్బందికి రక్షణ కల్పిస్తామని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ మోహన్‌కుమార్‌ చెప్పారు.

Published : 27 Nov 2022 04:26 IST

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : నల్లమల అటవీప్రాంతంలో పని చేస్తున్న అటవీశాఖ సిబ్బందికి రక్షణ కల్పిస్తామని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ మోహన్‌కుమార్‌ చెప్పారు. శనివారం కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథిగృహంలో అటవీశాఖ సిబ్బందితో డీఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అడవుల్లో పోడుభూముల సాగులో, భయపడుతూ విధులు నిర్వహిస్తున్న వైనాన్ని సిబ్బంది డీఎస్పీకి వివరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమంగా అటవీభూములను ఆక్రమించుకొని గొడవపడే గ్రామాలతో పాటు దుండగుల వివరాలు అందజేయాలన్నారు. గొడవ జరిగే ప్రాంతాల గురించి చెప్తే ముందుగా వెళ్లి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో కొల్లాపూర్‌ రేంజ్‌ అధికారి పద్మారావు, ఎస్సై బాలవెంకటరమణ యాదవ్‌, రేంజ్‌పరిధిలోని వివిధ బీట్లలో పనిచేసే ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని