logo

వనపర్తికి హరిత ప్లాజా హోటల్‌

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హరిత ప్లాజా హోటల్‌ నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2022 02:56 IST

వనపర్తి, న్యూస్‌టుడే: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హరిత ప్లాజా హోటల్‌ నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హోటల్‌ నిర్మాణానికి వనపర్తిలోని సర్వే నంబరు 411లో 6.24 ఎకరాల భూమిని కలెక్టరు షేక్‌ యాస్మిన్‌బాషా కేటాయించారని వివరించారు. కొత్త జిల్లాగా ఏర్పడిన తరవాత ప్రభుత్వ వైద్య కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాలలు వచ్చాయని, వీటికి తోడు వివిధ వ్యాపార రంగాలూ కొలువుదీరాయని వివరించారు. సాగునీటి రాకతో పంట ఉత్పత్తులు పెరిగాయని దీంతో సందర్శకులు తాకిడీ పెరిగిందన్నారు. జిల్లా కేంద్రంగా విస్తరించినా విశ్రాంతి భవనాల కొరత తీవ్రంగా ఉందని, తగిన మౌలిక వసతులతో అధునాతన హోటల్‌ నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. హరిత ప్లాజా హోటల్‌లో చిన్నపిల్లల ఆట స్థలం, రెస్టారెంట్‌, బాంక్వెట్‌ హాల్‌ ఉంటాయన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు చేపడతామని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని