logo

భద్రాద్రిలో రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

రాష్ట్రస్థాయి 6వ ఇంటర్‌ సొసైటీ లీగ్‌ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

Published : 29 Nov 2022 02:56 IST

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్‌

పాల్వంచ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి 6వ ఇంటర్‌ సొసైటీ లీగ్‌ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని బీసీ, మైనార్టీ, సోషల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు, ఏకలవ్య, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల సొసైటీలకు చెందిన 3,500 మంది హాజరవుతున్న క్రీడా సంబరం డిసెంబరు 1న ముగియనుంది. వీరంతా మొత్తం 13 క్రీడాంశాల్లో తలపడతారు. ఈ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గుణాత్మక విద్యపై దూరదృష్టితో ఆలోచించి ప్రతి నియోజకవర్గంలో అన్నివర్గాల వారికి ప్రత్యేక గురుకులాలు నెలకొల్పారన్నారు. రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌, బీసీ, మైనార్టీ గురుకులాల కార్యదర్శులు మల్లయ్య భట్టు, షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని