logo

హుండీ ఆదాయం రూ.23.64 లక్షలు

శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా కానుకలు అందించారు. ఉత్సవాల సందర్భంగా మూడో విడత హుండీలో కానుకలను సోమవారం లెక్కించగా..

Updated : 29 Nov 2022 06:42 IST

కానుకలు లెక్కిస్తున్న భక్తులు

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే : శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా కానుకలు అందించారు. ఉత్సవాల సందర్భంగా మూడో విడత హుండీలో కానుకలను సోమవారం లెక్కించగా.. రూ.23,64,698 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్యాంసుదరాచారి, తాజా మాజీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మూడు విడతలుగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.71,93,678 ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.16,52,136 అదనంగా వచ్చింది. 22 కిలోల 857 గ్రాముల మిస్రమ వెండిని భక్తులు హుండీకి సమర్పించినట్లు వారు తెలిపారు. సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. జాతరలో యాత్రికుల కొలహలం కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని