logo

ప్రజలతో సత్సంబంధాలకే కమ్యూనిటీ కనెక్ట్‌ : ఎస్పీ

ప్రజలతో నేరుగా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునేలా కమ్యూనిటీ కనెక్ట్‌ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు పరుస్తున్నట్లు ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌ పోలీస్‌ ప్రధాన కా

Published : 29 Nov 2022 03:05 IST

డీజీపీ సమీక్షలో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, చిత్రంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్‌

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : ప్రజలతో నేరుగా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునేలా కమ్యూనిటీ కనెక్ట్‌ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు పరుస్తున్నట్లు ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి వీసీ ద్వారా శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీతో ఎస్పీ మాట్లాడారు. పలు అంశాలపై ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైబర్‌ నేరాలు, అపరిచిత వ్యక్తుల సంచారం, మొబైల్‌ ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులను, వ్యాపార లావాదేవీలను నమ్మరాదని యువత, ఉద్యోగులకు వివరిస్తున్నట్లు తెలిపారు. యువత బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచిస్తున్నామన్నారు. కుటుంబ తగదాల్లో సఖ్యత కుదర్చడంలో జిల్లా పోలీసు పనితీరుపై డీజీపీ సంతోషం వ్యక్తం చేసి సిబ్బందిని ప్రశంసించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్‌, రమణారెడ్డి, ఆదినారాయణ, మధు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని