logo

కంటి వెలుగుకు స్పందన

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి చక్కని స్పందన లభిస్తోంది. గురువారం జిలావ్యాప్తంగా కంటి వెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించారు.

Published : 20 Jan 2023 06:14 IST

తొలిరోజు జిల్లావ్యాప్తంగా 6,062 మందికి పరీక్షలు

మహబూబ్‌నగర్‌ : నేత్ర పరీక్ష చేస్తున్న వైద్య సిబ్బంది

పాలమూరు, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి చక్కని స్పందన లభిస్తోంది. గురువారం జిలావ్యాప్తంగా కంటి వెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించారు. మొదటి రోజు 45 వైద్య కేంద్రాలలో 6,062 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో 1,535 మందికి దగ్గరి చూపు కళ్లజోళ్లను అందించారు. మరో 1,071 మందికి దగ్గరి-దూరం, దూరం చూపు కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. 15 రోజుల్లో వారి ఇంటికే కళ్లజోళ్లను పంపించనున్నారు. మొదటి రోజు నిర్వహించిన కంటివెలుగులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పాత పాలమూరు 23వ వార్డులో 241 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అతి తక్కువగా మిడ్జిల్‌ మండలంలోని అయ్యావారిపల్లిలో 58 మందికి కంటి పరీక్షలు చేశారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామంలో అత్యధికంగా కళ్లజోళ్లను ఇచ్చారు. ఇక్కడ 171 మందికి కంటి పరీక్షలు చేయగా 108 మందికి దగ్గరి చూపు కంటి అద్దాలు పంపిణీ చేశారు. తొలిరోజు అన్ని కంటి వెలుగు వైద్యశిబిరాల్లో ప్రజల నుంచి స్పందన లభించిందని డీఎంహెచ్‌వో డా.కృష్ణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని