ఆదర్శ పాఠశాలకు ఆదరణ
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పూర్తిస్థాయి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆదర్శ పాఠశాలలకు ఉమ్మడి జిల్లాలో మంచి ఆదరణ ఉంది.
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఫిబ్రవరి 15 వరకు గడువు
న్యూస్టుడే,నారాయణపేట న్యూటౌన్
ధన్వాడ ఆదర్శ పాఠశాల
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పూర్తిస్థాయి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆదర్శ పాఠశాలలకు ఉమ్మడి జిల్లాలో మంచి ఆదరణ ఉంది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతితో పాటు ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఆదర్శ పాఠశాలల్లో నిష్ణాతులైన ఆంగ్ల బోధకులు ఉండటంతో నాణ్యమైన విద్య అందుతోంది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించినా ఆదర్శ పాఠశాలలకు డిమాండ్ తగ్గలేదు. ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటోంది.
2013 నుంచి ప్రారంభం..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2013 నుంచి ఆదర్శ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ధన్వాడ, కోస్గి, వెల్దండ, గండీడ్, ఖిల్లాఘనపురం, కొత్తకోట, పెబ్బేరు, కోడేరు మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆంగ్ల మాధ్యమంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కొనసాగుతోంది. ఆంగ్ల ప్రావీణ్యులైన ఉపాధ్యాయులతో బోధన ఉండటంతో ప్రవేశాలకు పోటీ తీవ్రంగా ఉంటోంది. ఏటా ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షద్వారా ఒక్కో పాఠశాలలో వంద మందిని చేర్చుకుంటుండగా.. ఇంటర్మీడియట్లో సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆదర్శ పాఠశాలలోల 800 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.
చదవుతో పాటు వృత్తివిద్య..
ఆదర్శ పాఠశాలల్లో చదవుతో పాటు వృత్తి విద్య బోధిస్తున్నారు. బ్యూటీషియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు కొనసాగుతున్నాయి. 8వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు శిక్షణ అందజేస్తుండటంతో ఆయా కోర్సుల్లో పూర్తి స్థాయి నైపుణ్యత సాధించేందుకు అవకాశం ఉంటోంది. శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి కావాల్సిన డబ్బులకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వతహాగా సంపాదించుకొని చదువుకుంటున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు..
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 10 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఉండటంతో గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. సంబంధిత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు. ఆరవ తరగతి ప్రవేశాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీల భర్తీకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం మే 24న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆదర్శ పాఠశాలల్లో ప్రదర్శనకు ఉంచుతారు. మే 24 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. పరీక్షకు వారం రోజుల ముందే హల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా