logo

చేర్పులే ఎక్కువ..

వనపర్తి జిల్లాలోని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్త ఓటర్ల నమోదులో భాగంగా చేర్పులే ఎక్కువగా ఉన్నాయి.

Published : 25 Jan 2023 02:23 IST

నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు 9500
న్యూస్‌టుడే, వనపర్తి  

నపర్తి జిల్లాలోని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్త ఓటర్ల నమోదులో భాగంగా చేర్పులే ఎక్కువగా ఉన్నాయి. వనపర్తి జిల్లాగా ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో ఏడు మండలాలతో శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది. మిగిలిన ఏడు మండలాల్లో మూడు కొల్లాపూరు నియోజకవర్గం, రెండు దేవరకద్ర, మరో రెండు మక్తల్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. జిల్లాలో అత్యంత పెద్ద నియోజకవర్గంగా వనపర్తి గుర్తింపు పొందింది. ప్రత్యేక ఓటరు నమోదు, జాబితా సవరణ ప్రక్రియ ముగిశాక నియోజకవర్గంలో తుది జాబితాలు ప్రకటించారు. దీని ప్రకారం మొత్తం 2,46,511 ఓటర్లు ఉన్నారు.

తొలగింపులు 1,168 మాత్రమే..

నియోజకవర్గంలో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన శిబిరాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాల కారణంగా మొత్తం 10,668 మంది ఓటర్లుగా చేరారు. మృతులు, ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళ్లినవారు, నియోజకవర్గం నుంచి బదిలీ అయినవారు, ఓటర్లుగా వేరే ప్రాంతాల్లో పేర్లు నమోదుచేసుకున్న వారితో కలిపి మొత్తం 1168 ఓట్లను తొలగించారు. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేశాక తుది జాబితా ప్రకటించారు. తుది జాబితా కన్నా ముందు ముసాయిదా జాబితాలో 2,37,011 మంది ఓటర్లుగా ఉన్నారు. అనంతరం మార్పులు చేర్పులతో 9500 ఓట్లు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని