logo

కొత్త కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సారి గణతంత్ర వేడుకలను సమీకృత కార్యాలయాల భవనాల సముదాయంలోని నూతన కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Published : 26 Jan 2023 03:07 IST

ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ

కొత్త కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు, అదనపు కలెక్టర్లు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సారి గణతంత్ర వేడుకలను సమీకృత కార్యాలయాల భవనాల సముదాయంలోని నూతన కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు తెలిపారు. గౌరవవందన స్వీకారం, పోలీసు కవాతు, తర్వాత స్వాతంత్ర సమరయోధులకు సన్మానం, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, విశేష సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మువ్వన్నెల తోరణాలతో కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్టాల్స్‌ ఏర్పాటుకు గుడారాలు సిద్ధం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు, అదనపు కలెక్టర్లు తేజస్‌ నంద్లాల్‌ పవర్‌, సీతారామారావు తదితరులు గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని