logo

ఆడపిల్ల జన్మిస్తే నజరానా!

బాలికలపై వివక్ష పోవాలని, వారికి అండగా నిలవాలని ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సర్పంచులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ గ్రామాల్లో ఏ కుటుంబంలో బాలిక జన్మించినా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.

Published : 27 Jan 2023 04:38 IST

కోయిలకొండ, అమ్రాబాద్‌ : బాలికలపై వివక్ష పోవాలని, వారికి అండగా నిలవాలని ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సర్పంచులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ గ్రామాల్లో ఏ కుటుంబంలో బాలిక జన్మించినా ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. కోయిలకొండ మండలం ఉబ్బడితండా పంచాయతీ సర్పంచి శాంతిహరిసింగ్‌ మాట్లాడుతూ ఇప్పటి నుంచి వచ్చే గణతంత్ర దినోత్సవం వరకు ఏడాది కాలంలో పంచాయతీ పరిధిలోని తండాల్లో ఎవరి కుటుంబంలో బాలిక జన్మించినా రూ. 5,016 కానుకగా అందిస్తామని తెలిపారు. ఉబ్బడితండా పంచాయతీ పరిధి పల్లెమోనితండా, ఖుష్‌మహ్మద్‌పల్లితండా, అమ్య్రానాయక్‌తండా, ఖజూర్లగుట్టతండాలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. అమ్రాబాద్‌ మండలం వట్వర్లపల్లి సర్పంచి చతౄనాయక్‌ కూడా ఇలాగే స్పందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అమ్మాయి పుడితే తల్లిదండ్రులు బాధపడటం సరికాదన్నారు. గ్రామంలో ఆడపిల్లలు పుడితే వారు రూ. 3,016 చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి, వారు మేజర్‌ అయ్యాక డబ్బులు తీసుకునేలా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని