logo

నత్తనడకన సమీకృత మార్కెట్ల నిర్మాణం

జిల్లాలోని పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి నెలలు గడుస్తున్నా పనుల్లో వేగం కనిపించడం లేదు.

Published : 27 Jan 2023 04:43 IST

అలంపూర్‌లో పునాదుల దశలో జరుగుతున్న పనులు

న్యూస్‌టుడే, అలంపూర్‌: జిల్లాలోని పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసి నెలలు గడుస్తున్నా పనుల్లో వేగం కనిపించడం లేదు. దీంతో పురపాలికల్లో మార్కెట్లు లేక రోడ్లపైనే సంతలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలంపూర్‌, వడ్డేపల్లి పురపాలికల్లోని ఒక్కో సమీకృత మార్కెట్‌కు రూ.2 కోట్ల చొప్పున, గద్వాల పురపాలికకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశారు. అలంపూర్‌ పట్టణ కేంద్రంలో నిర్మాణ పనులు పునాదుల దశ కూడా దాటలేదు. ఇక్కడ ప్రతీ గురువారం బస్టాండ్‌ ప్రాంతం నుంచి గాంధీచౌక్‌ వరకు రోడ్లపైనే కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరకులు విక్రయిస్తున్నారు. నిత్యం అలంపూర్‌ ఆలయాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇదే రోడ్డు మార్గంగుండా వెళ్తారు. రోడ్డుపై సంత నిర్వహిస్తే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి వడ్డేపల్లిలోనూ ఉంది. ఇక్కడ స్థల సమస్యతో పనులు ప్రారంభం కాలేదు. గద్వాల పురపాలికలో మొదట్లో గుత్తేదారుడు పనులు చేయకుండా వెళ్లగా, మళ్లీ ఈ మధ్య కాలంలో పనులు కొనసాగిస్తున్నారు. స్లాబ్‌ వరకు పనులు జరిగాయి.


త్వరలో పూర్తి చేయిస్తాం
- నిత్యానంద్‌, కమిషనర్‌, అలంపూర్‌, వడ్డేపల్లి

అలంపూర్‌ పురపాలికలో సమీకృత మార్కెట్‌ పనులు ప్రారంభించారు. పునాదులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వడ్డేపల్లి పురపాలికలో స్థల సమస్యతో కొంత ఆలస్యం జరుగుతుంది. త్వరలో సమీకృత మార్కెట్‌ పనులు పూర్తి చేయిస్తాం.


మే నెల వరకు..
- పుష్పమ్మ, జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి

గద్వాలలోని సమీకృత మార్కెట్‌ను త్వరలో పూర్తి చేయిస్తాం. గుత్తేదారుడు మొదట పనులు చేయలేదు. మరోసారి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారు. మే వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని