logo

పరిస్థితులపై పూర్తి అవగాహన : ఎస్పీ

మహబూబ్‌నగర్‌ జిల్లా తనకు కొత్త కాదని, ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని నూతన ఎస్పీ కె.నరసింహ అన్నారు. గురువారం సాయంత్రం పోలీసు శాఖ కార్యాలయంలో ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు.

Updated : 27 Jan 2023 06:41 IST

ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న కె.నరసింహ

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లా తనకు కొత్త కాదని, ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని నూతన ఎస్పీ కె.నరసింహ అన్నారు. గురువారం సాయంత్రం పోలీసు శాఖ కార్యాలయంలో ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2011లో ఉమ్మడి జిల్లాలో ఏడాది పాటు డీఎస్పీ ప్రొబేషనరీ చేశానన్నారు. ఆ సమయంలో అనేక ప్రాంతాలను తిరిగినట్లు వివరించారు. నేరాలను అదుపు చేయడానికి సిబ్బందితో కలిసి కృషి చేస్తానన్నారు. నూతన ఎస్పీకి బదిలీపై వెళ్తున్న ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు, తదితరులు అభినందనలు తెలిపారు.

* ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ స్వస్థలం నల్గొండ జిల్లా చండూర్‌ మండలంలోని కొండాపురం. 2010లో గ్రూప్‌-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నారు. తొలుత ఆర్మూర్‌లో డీఎస్పీగా పనిచేశారు. తర్వాత గుంటూర్‌, కామారెడ్డి రూరల్‌ డీఎస్పీగా 2017 వరకు పనిచేశారు. అనంతరం అదే ఏడాది అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. సైబరాబాద్‌, వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ అదనపు ఎస్పీగా పనిచేశారు. మూడున్నరేళ్ల నుంచి గవర్నర్‌ వద్ద ఏడీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు నియమించింది.

బదిలీ ఎస్పీకి వీడ్కోలు..

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం : మహబూబ్‌నగర్‌ ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఆర్‌.వెంకటేశ్వర్లుకు జిల్లా పోలీసు అధికారులు వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా కె.నరసింహ విధుల్లో చేరిన తర్వాత ఆయన రిలీవ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్‌, ఆదినారాయణ, శ్రీనివాసులు రమణారెడ్డి, సీఐలు, ఎస్సైలు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది వీడ్కోలు చెప్పారు. ఆర్‌.వెంకటేశవర్లు 2021 ఏప్రిల్‌ 6వ తేదీన జిల్లా ఎస్పీగా వచ్చారు. ఇన్నాళ్లు తనకు సహకారం అందించిన పోలీసు సిబ్బందికి, జిల్లా అధికారులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని