logo

హంస వాహనంపై శ్రీనివాసుడి విహారం

మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పద్మావతి, అలివేలుమంగ సమేత శ్రీనివాసుడు హంస వాహనంపై మన్యంకొండ వీధుల్లో భక్తులకు కనువిందు చేశాడు.

Updated : 02 Feb 2023 06:40 IST

గర్భాలయం నుంచి మెట్లదారి గుండా శ్రీనివాసుణ్ని

హంస వాహనంలో ఊరేగింపునకు తీసుకొస్తున్న అర్చకులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పద్మావతి, అలివేలుమంగ సమేత శ్రీనివాసుడు హంస వాహనంపై మన్యంకొండ వీధుల్లో భక్తులకు కనువిందు చేశాడు. గర్భాలయ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం గర్భాలయ మెట్లదారి గుండా తేరు మైదానం వైపు నాగశేషుడి ఆలయం వరకు గోవింద నామస్మరణల మధ్య ఊరేగింపుగా తెచ్చారు. హంసవాహనంలో ఊరేగుతున్న స్వామిని అడుగడుగునా భక్తులు దర్శించుకొని తరించారు. నాగశేషుడి ఆలయంలో పూజలు అందుకున్న స్వామివారు తిరిగి గర్భాలయానికి హంసవాహనంపై వెనుదిరిగారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్‌, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు, పర్యవేక్షణాధికారి నిత్యానందచారి, ఆలయ అర్చకులు నర్సింహయ్య, జగదీష్‌, రాఘవేంద్రస్వామి, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు