logo

త్వరలో జిల్లాకు ప్రభుత్వ ఫిజియో థెరపీ కళాశాల : మంత్రి

జిల్లా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలను అందించడానికి రూ.500- 1,000 కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పని లేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 02 Feb 2023 04:41 IST

మాట్లాడుతున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, న్యూస్‌టుడే : జిల్లా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలను అందించడానికి రూ.500- 1,000 కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పని లేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్సీ నర్సింగ్‌ విద్య పూర్తి చేసిన వారికి అనేక ఆఫర్లు వస్తాయన్నారు. త్వరలో జిల్లాకు ఫిజియోథెరపీ కళాశాల వస్తుందన్నారు. విద్యార్థులకు బాగా బోధించాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో వైద్యులు విశేష సేవలు అందించారన్నారు. అన్ని విభాగాల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ డా.రమేశ్‌, డీఎంహెచ్‌వో డా.కృష్ణ, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.జీవన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.భాస్కర్‌ నాయక్‌, పుర ఛైర్మన్‌ కేసీ నర్సింహులు, నాయకులు గణేశ్‌, సత్యనారాయణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని