logo

పునరావాస కేంద్రాల్లో పనులన్నీ పూర్తి చేయండి : కలెక్టర్‌

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు పెండింగ్‌లోని పనులన్నింటిని పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

Published : 02 Feb 2023 04:41 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు పెండింగ్‌లోని పనులన్నింటిని పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల, భూసేకరణ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పునరావాస కేంద్రాలు ర్యాలంపాడు, నాగర్‌దొడ్డి, ఆలూరు, చిన్నోనిపల్లి కేంద్రాలలో పెండింగ్‌లోని పనుల్లో వేగం పెంచాలన్నారు. విద్యుత్తు, మరుగు కాలువలు, నీటి సరఫరా, రోడ్లుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలన్నారు. గట్టు, గార్లపాడు, కుచ్చినేర్ల గ్రామాల్లో భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వారం పనులకు సంబంధించిన నివేదిక పంపించాలని ఆదేశించారు. ఆర్డీవో రాములు, నీటి పారుదలశాఖ అధికారులు, శ్రీనివాసరావు, రహీముద్దీన్‌ మిషన్‌ భగీరథ డీఈ శ్రీధర్‌రెడ్డి, విద్యుత్తుశాఖ ఎస్‌ఈ భాస్కర్‌, భూసేకరణ అధికారులు, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు