చిన్న వయసులో పెద్ద కష్టం
సదరం శిబిరానికి హాజరై, వైకల్య ధ్రువపత్రం పొందాలంటే ముందుగా ‘మీసేవ’లో స్లాట్ నమోదుచేయించుకోవాల్సి ఉంది.
సదరం శిబిరానికి హాజరై, వైకల్య ధ్రువపత్రం పొందాలంటే ముందుగా ‘మీసేవ’లో స్లాట్ నమోదుచేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ సమయంలో ధ్రువపత్రం పొందేవాళ్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. రెండేళ్లుగా పక్షవాతంతో ఎడమ కాలు, చెయ్యి కదపలేని స్థితిలో ఉన్న జి.పారిజాతను బుధవారం తల్లి రాములమ్మ, చిన్నాన్న జనార్ధన్, బంధువులు ఇలా ఓ దుప్పట్లో వెల్దండలోని మీసేవ కేంద్రం లోపలికి తీసుకొచ్చారు.
వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే
కూలీకెళ్తే తప్ప పూట గడవని పేద కుటుంబంలో జన్మించినా.. కష్టపడి చదివి ఆరోగ్య కార్యకర్తగా శిక్షణ పొంది ఇతరులకు సేలందించిన ఓ యువతికి పక్షవాతం శాపంగా మారింది. వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమై అచేతన స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది.. వైద్యం కోసం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.. వెల్దండ మండల కేంద్రానికి చెందిన బాలయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. బాలయ్య 2017లో మృతి చెందాడు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన పారిజాత ఆరోగ్య కార్యకర్తగా శిక్షణ పొంది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా సేవలందించింది. బీఎస్సీ నర్సింగ్‌లో చేరి మూడో ఏడాది చదువుతుండగానే విధి వక్రీకరించింది. ఉన్నంతలో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని అనుకోని ఘటన కుదిపేసింది. 2020 జులైలో ఆకస్మికంగా పక్షవాతం బారిన పడింది. దీంతో ఆమె ఎడమచేయి, కాలు స్పర్శ లేకుండా పోయింది. కుమార్తెకు కష్టం రావడంతో కన్నీటి పర్యంతమైన తల్లి తెలిసిన చోటల్లా అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేసి హైదరాబాద్, కర్నూల్, గుర్మిట్‌కల్, చిత్తూరు తదితర పట్టణాల్లో వైద్యం చేయించింది. అయినా ఫలితం దక్కలేదు. మెరుగైన వైద్యం చేయించలేక ఇంటికి తరలించింది. గ్రామంలో చిన్నపాటి ఇల్లు మినహా ఆ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మందులు, ఫిజియోథెరపీ కోసం నెలకు రూ.20వేల వరకు ఖర్చు అవుతున్నాయి. పారిజాత మందులకు ఇబ్బందిగా ఉందని తల్లి రాములమ్మ కన్నీటి పర్యంతమైంది. చేసేదేమీ లేక కుటుంబపోషణకు ఆమె కొద్దిరోజులు కూలీకి వెళ్లినా.. కాలు, చేయి కదపలేని పారిజాత మంచానికే పరిమితమై కనీసం వ్యక్తిగత పనులూ చేసుకునే స్థితిలో లేక పోవడంతో ఇంట్లో ఆమెకు తోడుగా ఉండేందుకు తల్లి కూలీ పనులు మానుకుంది. తల్లే అన్నం తిన్పించడం, సమయానికి మందులు వేయడం వంటి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సోదరులు చిన్నవాళ్లు కావడంతో వాళ్లు బతకడమే కష్టంగా ఉంది. దాతలు చేయూతనివ్వాలని ఆ కుటుంబం కోరుకుంటోంది. సాయం చేయాలనుకునే వారు చరవాణి నం. 8008551780లో సంప్రదించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని