ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి
జిల్లా కేంద్రంలోని కొత్తకోట రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడ సలాలను నివాస ప్రాంతాలుగా మార్చే ప్రక్రియ ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.
పారిశ్రామికవాడపై సందిగ్ధం
న్యూస్‌టుడే, వనపర్తి, వనపర్తి న్యూటౌన్
జిల్లా కేంద్రంలోని కొత్తకోట రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడ సలాలను నివాస ప్రాంతాలుగా మార్చే ప్రక్రియ ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ముఖ్యంగా గతంలో పారిశ్రామిక ప్రాంతాలను తొలగిస్తారని ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో సిరాస్తి వెంచర్లు వెలిశాయి. దీంతో పలువురు ఆయా ప్రాంతాల్లో సలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ కొన్ని వందల ప్లాట్ల కొనుగోలు ప్రక్రియను నమోదు చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తోనే చిక్కు..
అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడంలో భాగంగా ఇళ్ల సలాలు కొనుగోలుచేసినవారు ఎల్‌ఆర్‌ఎస్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు కొత్తకోటరోడ్డు, ఇతర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో సలాలు కొన్నవారు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా అప్పట్లో స్వీకరించలేదు. పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్లాట్లను నివాసాలకు అనుమతించేది లేదని పురపాలక సంఘంలో దరఖాస్తులను తీసుకోలేదు. దీంతో రెండోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించినప్పుడు రూ.1000 చొప్పున రుసుంలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం నుంచి పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తే అప్పుడు మిగిలిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని పురపాలక సంఘం అధికారులు పేర్కొన్నారు.
త్రిశంకుస్వర్గంలో ప్లాట్ల యజమానులు..
పారిశ్రామిక ప్రాంతాల్లోని సిరాస్తి వెంచర్లలో కొనుగోలు చేసిన సలాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలియడంతో ప్లాట్ల యజమానులు సంబరపడ్డారు. తీరా రిజిస్ట్రేషన్‌కు వెళితే ఎల్‌ఆర్‌ఎస్ ఉండాల్సిందేనని అధికారులు చెప్పడంతో వాపోతున్నారు. వెంచర్ వేశాక ఒకసారి విక్రయించిన సలాలను మరోసారి విక్రయించేలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సమాచారం. అదీ ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే.. ఈ విషయంలో స్పష్టత లేదు. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు మాత్రం అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో తాము కొనుగోలు చేసిన సలాలను అమ్ముకోవాలో లేదో తెలియక త్రిశంకుస్వర్గంలో యజమానులు ఉన్నారు. పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతాలను ఎత్తేసి కొత్తగా చిట్యాల వైపు పారిశ్రామికవాడ సలాన్ని గుర్తించారని సమాచారం. దీనిపై స్పష్టత వస్తే ప్లాట్ల యజమానుల్లో ఆనందం వెల్లివిరియనుంది.
త్వరలోనే నిర్ణయం..
పారిశ్రామిక ప్రాంతాలను ఇప్పుడున్న చోటు నుంచి మరో చోటుకి మార్చనున్నాం. దీనిపై పురపాలక సంఘాల పరిధిలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే వనపర్తి పారిశ్రామికవాడను మరో ప్రాంతానికి తరలిస్తాం.
- విక్రమసింహారెడ్డి, పుర కమిషనర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?