కొనుగోలు కేంద్రం లేక రైతుల అవస్థలు
జిల్లాలోని కృష్ణాతీరం తదితర ప్రాంతాల్లో ఈసారి సీజన్‌లో విస్తారంగా మిర్చి పంటలను సాగు చేశారు.
న్యూస్‌టుడే, కొల్లాపూర్
జిల్లాలోని కృష్ణాతీరం తదితర ప్రాంతాల్లో ఈసారి సీజన్‌లో విస్తారంగా మిర్చి పంటలను సాగు చేశారు. కానీ ప్రభుత్వపరంగా మార్కెట్ లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి బాగానే ఉన్నా.. పంటల సాగుకు పెట్టుబడులు కూడా ఎక్కువయ్యాయని రైతులు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డులో మిర్చిపంటలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గిట్టుబాటు ఏదీ?
నాగర్‌కర్నూల్ జిల్లాలో 7 వేల ఎకరాలకుపైగా మిరప పంటను సాగు జరగగా కొల్లాపూర్ ప్రాంతంలో 250 ఎకరాల్లో మిర్చిపంటలు సాగు చేశారు. తీరప్రాంతాలైన సోమశిల, అమరగిరి, జటప్రోల్, కొప్పునూర్, తదితర గ్రామాలు, పదర, తెల్కపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు ఈ మిర్చి పంటలను సాగు చేయడం జరిగింది. ఎకరానికి రూ.60వేల దాకా వ్యయమైంది. దిగుబడి కూడా 13 నుంచి 15 టన్నుల వరకు వచ్చింది. ప్రైవేట్ మార్కెట్‌లో కిలో రూ.350 దాకా మిర్చి ధర పలుకుతోంది. తాము పంటల సాగు చేసి మిర్చి విక్రయించడానికి వెళ్తే కిలో కిలో రూ.200 కూడా రావడం లేదని సోమశిలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీళ్లకు కూడా ఇబ్బంది పడ్డామని అధిక వ్యయంతో శ్రీశైలం తిరుగుజలాలు, బోరు నీటిని పైపుల ద్వారా పొలాలకు పారించుకున్నామన్నారు. ప్రైవేట్ మార్కెట్లో మాత్రం తక్కువ ధర అడగడంతో నష్టం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సూచనలతో పంటల మార్పిడి చేసుకొని వాణిజ్యపంటలు సాగు చేసినా గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వ మార్కెట్లలో మిర్చిపంటలను కొనుగోలు చేయాలని కోరారు. నిల్వ ఉంచడంతో బరువు తగ్గి తరుగు సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఉద్యానశాఖ అధికారి లక్ష్మణ్ స్పందిస్తూ జిల్లా అధికారుల దృష్టికి మిర్చిపంట రైతుల సమస్యలను తీసుకెళ్తామన్నారు.
దిగుబడి బాగానే ఉన్నా..
మిర్చి దిగుబడి బాగానే వచ్చినా.. ఆశించిన ధర రావడం లేదు. సమీపంలోని నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో కూడా కొనుగోలు చేయడం లేదు. దీంతో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది. కిరాయి రూ. 10వేలకు పైగా ఖర్చవుతోంది. అక్కడ వేచి ఉంటే మరింత ఖర్చు పెరుగుతోంది. పంట అమ్మితే పెరిగిన ధరలతో ఖర్చులు కూడా మిగిలే పరిస్థితులు లేవు. విక్రయించుకోవడానికి స్థానికంగా మార్కెట్ లేదు.ప్రభుత్వపరంగా మిర్చిపంటలు కొనుగోలు చేయాలి.
- వెంకటరమణమ్మ, సోమశిల, మహిళా రైతు
క్వింటా రూ. రెండు వేలు రావడం లేదు..
నాకున్న మూడు ఎకరాల్లో మిర్చిపంట సాగు చేశాను. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.60 వేల దాకా ఖర్చు పెట్టా. కానీ క్వింటా రూ.2,000 కూడా రావడం లేదు. మిర్చి పంట దిగుబడి చూసి సంతోషించినా గిట్టుబాటు లేక నష్టాలపాలవుతున్నాం. అధికారులు స్పందించి ప్రభుత్వపరంగా కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి.
- డబ్బా నరసింహా, రైతు, మాధవస్వామినగర్, కొల్లాపూర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని