logo

నేరాల కట్టడికి కృషి : ఎస్పీ

మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల సంఖ్య తగ్గించాలని కృషి చేయాలని ఎస్పీ సృజన అన్నారు. గురువారం మల్దకల్‌ ఠాణాను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 03 Feb 2023 03:16 IST

మల్దకల్‌ : దస్తాలను పరిశీలిస్తున్న ఎస్పీ సృజన

మల్దకల్‌, న్యూస్‌టుడే : మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల సంఖ్య తగ్గించాలని కృషి చేయాలని ఎస్పీ సృజన అన్నారు. గురువారం మల్దకల్‌ ఠాణాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోలింగ్‌ ముమ్మరం చేసి నేరాలను అదుపులోకి తీసుకురావాలన్నారు. కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఠాణా పరిసరాలను పరిశీలించి మొక్కలు నాటారు. దస్త్రాలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సిబ్బందిని అడిగి సమస్యలను తెలుసుకున్నారు. సీఐ చంద్రశేఖర్‌, మల్దకల్‌ ఎస్సై శేఖర్‌, ఏఎస్సై ఈశ్వరయ్య, సిబ్బంది ఉన్నారు

గట్టు : గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సృజన పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని ఠాణాను గురువారం సందర్శించారు. ఎస్సై పవన్‌కుమార్‌, పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నేరాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఠాణాను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్నారు. సీఐ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని