logo

సింగోటం.. మనసుకు ఆహ్లాదం!

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం పరిసర ప్రాంతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Published : 04 Feb 2023 05:44 IST

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం పరిసర ప్రాంతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సురభిరాజుల పాలనలోనే వెయ్యేళ్ల కిందట ఈ గ్రామంలో లింగాకారంలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం వెలసింది. సింగోటం ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటంతో కిలోమీటరు పొడవున కరకట్ట నిర్మించి తటాకం తవ్వారు. కాలక్రమంలో ఆలయానికి ఎదురుగా గుట్టపై రత్నలక్ష్మి ఆలయం నిర్మించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీకేఎల్‌ఐ)లో భాగంగా రెండో జలాశయంగా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు రూపాంతరం చెందింది. ఈ జలాశయం ఏడాది పొడవునా జలకళను సంతరించుకొని దిగువన ఉన్న 10 గ్రామాల రైతుల పొలాలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ప్రస్తుతం యాసంగిలో జలాశయం దిగువన 10వేల ఎకరాలకు పైగా వరిపంటలు, తోటలు, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జలాశయం కట్టపై కాటేజీలు, రత్నలక్ష్మి గుట్టపై వ్యూపాయింట్‌ ఏర్పాటుతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని