logo

గ్రామీణుల కంటి వెలుగు... కేసీఆర్‌

గ్రామీణ ప్రాంత ప్రజల కంటి వెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు.

Published : 04 Feb 2023 05:44 IST

కంటివెలుగు ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ క్రాంతితో మాట్లాడుతున్న మంద జగన్నాథం, చిత్రంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌

ఇటిక్యాల, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంత ప్రజల కంటి వెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. శుక్రవారం కొండేరులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొండేరులో పారిశుద్ధ్యం, పచ్చదనంను భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అందజేస్తుందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత అన్నారు. భారాస నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి మంద శ్రీనాథ్‌, జడ్పీటీసీ హనుమంత్‌రెడ్డి, సర్పంచి వీరన్న, అలంపూర్‌ మార్కెట్‌యార్డు మాజీ ఛైర్‌పర్సన్‌ రాందేవ్‌రెడ్డి, భారాస నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని