logo

భారాసకు అడ్డుకట్ట వేస్తాం

రాష్ట్రంలో తొమ్మిదేళ్ల నుంచి నియంత పాలన సాగిస్తున్న బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టడానికి తమ పార్టీ సమాయత్తమవుతోందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతరావు పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 05:44 IST

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు

హాథ్‌ సే హాథ్‌ జోడో కరపత్రాలు విడుదల చేస్తున్న సునీతరావు,
నాయకులు జి.మధుసూదన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌ తదితరులు

పాలమూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొమ్మిదేళ్ల నుంచి నియంత పాలన సాగిస్తున్న బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టడానికి తమ పార్టీ సమాయత్తమవుతోందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతరావు పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఈ నెల ఆరో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయ్యే హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆమె విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపడానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాలపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఈ నెల 6న మేడారం నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం విజయవంతం చేయడానికి మహిళా కాంగ్రెస్‌ కృషి చేస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ఆగడాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అరాచకాలను అడ్డుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వసంత, నాయకులు చంద్రకుమార్‌ గౌడ్‌, లక్ష్మణ్‌యాదవ్‌, సిరాజ్‌ఖాద్రీ, బెనహర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని