logo

హీరో కల్యాణ్‌రామ్‌కు అభిమానుల ఘనస్వాగతం

హైదరాబాదు నుంచి రోడ్డుమార్గంలో కర్నూలుకు వెళ్తున్న సినీ హీరో కల్యాణ్‌రామ్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ అభిమానులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.

Published : 04 Feb 2023 05:44 IST

పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ హీరో కల్యాణ్‌రామ్‌

పుల్లూరు(ఉండవల్లి), న్యూస్‌టుడే : హైదరాబాదు నుంచి రోడ్డుమార్గంలో కర్నూలుకు వెళ్తున్న సినీ హీరో కల్యాణ్‌రామ్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ అభిమానులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కర్నూలులోని శ్రీరామ థియేటర్‌లో తన నూతన చిత్రం ‘అమిగోస్‌’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమానికి వస్తున్నారనే సమాచారంతో అభిమానులు పెద్దసంఖ్యలో పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. కారులో నుంచి అభిమానులకు కరచాలనం, అభివాదం చేసుకుంటూ ముందకు సాగగా టోల్‌ప్లాజా దాటేందుకు దాదాపు 10 నిమిషాలు పట్టింది. అభిమానులు ద్విచక్రవాహన, కార్లతో ర్యాలీగా కర్నూలు వైపు స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఉన్న జెండాలతో నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చారు. పలువురు అభిమానులు ఆటోలతో విన్యాసాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శేఖర్‌చౌదరి, అలంపూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చిరు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఎమ్మిగనూరు, డోన్‌ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, రంగారెడ్డి, అయిజ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని