logo

అర్హులకు దళితబంధు వర్తింపజేయాలి

అర్హులకు దళితబంధు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ డిమాండు చేశారు.

Updated : 04 Feb 2023 05:43 IST

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: అర్హులకు దళితబంధు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ డిమాండు చేశారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్లకు కేటాయించడం హర్షణీయమని, విధివిధానాలు ప్రకటించాలని డిమాండు చేశారు. ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాన్ని దిల్లీకి తెసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతరం ఏవో శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పి.జంబులయ్య, అంజన్న, జయన్న, జయమ్మ, ఆర్‌.కృష్ణ, రమేశ్‌, నరేశ్‌, సాయికుమార్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాల్సిందే

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మారుతి డిమాండు చేశారు. శుక్రవారం పాలమూరు విశ్వ విద్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి విద్యా విధానం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పీయూకు రూ.300 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీయూ నాయకులు పవన్‌రెడ్డి, శివకుమార్‌, భాస్కర్‌, తేజ్‌కుమార్‌,  వెంకటేశ్‌, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని