logo

క్యాన్సర్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

క్యాన్సర్‌ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించి క్యాన్సర్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని విప్‌ గువ్వల బాల్‌రాజు అన్నారు.

Published : 05 Feb 2023 05:43 IST

సమావేశంలో పాల్గొన్న విప్‌ గువ్వల బాల్‌రాజు, పక్కన కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : క్యాన్సర్‌ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించి క్యాన్సర్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని విప్‌ గువ్వల బాల్‌రాజు అన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జీబీఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్‌ స్థాయి అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్‌ రోగులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సకాలంలో పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ముందుకెళ్లాలన్నారు. చిన్న వయస్సులో వివాహాలు చెయ్యడం, వంశపారంపర్యం, ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉండే మహిళలకు క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. రసాయన, క్రిమి సంహారక మందులు, పొగాకు, మత్తు పానియాలను తీసుకోవడం వల్లనే వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మహిళల్లో వ్యాధులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణ, సాధికారతకు ట్రస్టు ఛైర్‌పర్సన్‌ గువ్వల అమల ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. మహిళల సంక్షేమానికి ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించనున్నట్లు భరోసానిచ్చారు. భవిష్యత్‌లో ఉచితంగా మండలాల్లో క్యాన్సర్‌ పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్యాన్సర్‌ నివారణకు 11 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వరకు హెచ్‌.పి.వి వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. పుర ఛైర్మన్‌ నర్సింహాగౌడ్‌, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ, ఎంపీపీ శాంతాబాయి, డీడబ్ల్యూవో వెంకటలక్ష్మి, ఆర్డీవో పాండు, తహశీల్దారు కృష్ణయ్య, నేతలు మనోహర్‌, రాజేశ్వర్‌రెడ్డి, పర్వతాలు, లోక్యానాయక్‌, రమేశ్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని