logo

నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం

నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఉచిత న్యాయ సహాయ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పద్ధతి ఎంతో ఉపయోగ పడుతుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 05:17 IST

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రీ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కేంద్రం వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, కలెక్టర్‌ రవి, ఎస్పీ నరసింహ తదితరులు

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఉచిత న్యాయ సహాయ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పద్ధతి ఎంతో ఉపయోగ పడుతుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని గుర్తించిన 16 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టంను వర్చువల్‌ పద్ధతి ద్వారా ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావతి, కలెక్టర్‌ రవి నాయక్‌, ఎస్పీ నర్సింహతో పాటు మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి శ్రీనివాసులు, ఫ్యామిలీ కోర్టు, మూడో అదనపు సెషన్స్‌ జిల్లా జడ్జి నీరజ, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎంకే పద్మావతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, ఎక్సైజ్‌ కోర్టు, 2వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.శిరీషా, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది మనోహర్‌, పీపీ జనార్దన్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రఘుపతి, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ యోగేశ్వరీ, రాజు యాదవ్‌, మల్లారెడ్డి, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని